ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గుండ్లకమ్మ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన నాలుగు టన్నులు ఇసుకను సోమవారం సేబ్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. గ్రామ శివారు ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో దర్శి సేబ్ సీఐ బి సుందరరామయ్య, ఎక్సైజ్ ఎస్సై ఎం శ్రీధర్ బాబు సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుకను, జెసిబి ని, ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు .జెసిబి ఆపరేటర్ ను , ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. జెసిబి కి రూ. 50 వేలు ట్రాక్టర్ కు రూ.10 వేలు జరిమానా విధించడం జరిగించి నట్లు సెబ్ అధికారులు వివరించారు.


