దర్శి నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం సాయంత్రము దేశ రక్షణ కోసం పనిచేసి పదవీ విరమణ పొందిన ముగ్గురు మాజీ సైనికులకు, ఇరువురు మాజీ సైనికుల సతీమణిలకు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. మార్తుల వెంకటేశ్వర్ రెడ్డి, పి.బి, ఓబయ్య, బి, రామయ్య, పి. ఆది లక్ష్మమ్మ, జిలాబి లను సత్కరించారు. పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నెపూడి, స్టీవెన్, కౌన్సిలర్ మేడగం, మోహన్ రెడ్డి విసీ రెడ్డి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
