బొట్లపాలెం దళిత మహిళల హత్యా యత్నం ఘటన ఫై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చెయ్యాలి -దళిత నేత నీలం డిమాండ్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామన్న కలెక్టర్ -రక్షణ కోసం తూర్పు గంగవరం లో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ -మౌనిక కుమార్తెలిద్దరిని రెసిడెన్సియల్ స్కూల్ లో చేర్పించేందుకు ఆదేశాలు

ఆగస్టు నెల 14 వ తేదీన బొట్లపాలెం లో హత్య యత్నానికి గురైన దళిత మహిళల అమానుష ఘటన ఫై విచారణకు దళిత నేత నీలం నాగేంద్ర డిమాండ్ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని జిల్లా కలెక్టర్ ఏ.ఏస్ దినేష్ కుమార్ తెలిపారు.
సోమవారం స్పందన హాల్ లో జిల్లా కలెక్టర్ ను హత్య యత్నానికి గురైన దళిత మహిళలు కామునూరి మౌనిక పిల్లలు మరియు తల్లి జక్కుల అనురాధ ను తీసుకొని నీలం నాగేంద్ర కలెక్టర్ ను కలిసారు. దర్శి మండలం బోట్లపాలెం లో మార్చి నెలలో కులాంతర వివాహం చేసుకున్న జక్కుల సాయిరాం తల్లి సోదరి ఫై అప్పట్లోనే గంగిరెడ్డి బ్రాహ్మరెడ్డి అతని భార్య పుల్లమ్మ గొడ్డళ్ళతో దాడి చేసి హత్య యత్నం చేసారన్నారు.
కానీ దర్శి ఎస్సై రామక్రిష్ణ సాధారణ బెయిల్ బుల్ కేసు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారన్నారు. మరల దాడి కి గురైన దళిత మహిళలు దాడి చేసినట్టు కౌంటర్ ఫాల్స్ కేసు పెట్టారన్నారు ఎస్పీ మల్లికాగార్గ్ ఈ కౌంటర్ కేసు ను తీసివేయించారన్నారు. దర్శి ఎస్సై రామక్రిష్ణ అండతో రెచ్చిపోయిన గంగిరెడ్డి బ్రాహ్మరెడ్డి పుల్లమ్మ లు ఆగష్టు 14 వ తారీకు రాత్రి కామునూరి మౌనిక మరియు జక్కుల అనురాధ అను దళిత మహిళల ఫై కళ్ళల్లో కారం చల్లి కత్తులతో పొడిచారన్నారు.
మౌనిక ను అర్ధనగ్న వివస్త్ర చేసి పెట్రోల్ పోసి చంపటానికి అగ్గిపెట్టె గీసి వెలిగించబోయరన్నారు. అమానుష ఆటవిక ఘటన ఫై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి విచారణ జరిపి నిందుతులకు జైలు శిక్ష విధించాలని జిల్లా కలెక్టర్ ను దళిత నేత నీలం నాగేంద్ర డిమాండ్ చేసారు. బోట్లపాలెం లో దళితులు చాలా తక్కువ మంది ఉన్నందున పక్కన సమీపం లో ని తాల్లూరు మండలం తూర్పు గంగవరం లో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలన్నారు. వెంటనే కలెక్టర్ ఒంగోలు ఆర్డిఓ కు ఫోన్ చేసి స్థలం ఇల్లు నిర్మానికి చర్య తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మౌనిక కుమార్తెలిద్దరిని చీమకుర్తి రెసిడెన్సీయల్ స్కూల్ లో చేర్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణ్ నాయక్ ను ఆదేశించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మాల మహానాడు నాయకులు దార అంజయ్య, జనమాల నాగయ్య, తానికొండ ఆనంద్, పులి వికాస్ , రామారావు తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *