(JSDM-బాపట్ల-అద్దంకి) :
బాపట్ల జిల్లా అద్దంకి మండల పరిధిలో శంకవరప్పాడుకు చెందిన కొందరు యువకులు అద్దంకి నుండి ధర్మవరం, వల్లాపల్లి, గ్రామాలకు చెందిన జూనియర్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులు, అద్దంకి కి చెందిన ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుకొని, ఈ సోమవారం సాయంత్రం 7గంటల సమయంలో వారి గ్రామాలకి తిరిగి వెళుతున్న సమయంలో, కాలేజ్ వాహనం శంకవరప్పాడు సమీపంలోకి రాగానే గ్రామానికి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వ్యాన్ లో ఉన్న తమపై దాడి చేసి పారిపోయారని విద్యార్థులు తెలియజేసారు. విద్యార్థుల తల్లిదండ్రులు శంకవరప్పాడు గ్రామం చేరుకొని, దాడి చేసినవారిని గుర్తించే ప్రయత్నం చేయగా... వారు పరాయినట్టు తెలిపారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
