ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేశారని, విదేశాల్లో ఉన్నత చదువులకు సైతం ఆర్థికపరంగా చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1.18 కోట్లతో నిర్మించిన తరగతి గదులు. రూ. 80 లక్ష లతో నిర్మించిన గ్రామ సచివాలయం-1,2 నూతన భవనాలను జిల్లా పరిషత్ చైర్ప ర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ…. గత టీడీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని, డబ్బున్న వారి పిల్లలు చదువుకునే విధం గా కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించింద ని, విద్యను అడ్డంపెట్టుకొని వ్యాపారం చేసు కునే బడాపెట్టుబడిదారులకు చదువులు తల్లిని తాకట్టు పెట్టారని విమర్శించారు. దశా బ్దాల కాలంగా శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలల్లోనే బడుగు, బలహీన వర్గాలు,
ఆర్థికంగా వెనకబడిన వారి పిల్లలు చదువు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో అనేక చోట్ల పాఠశాల గోడలు కూలి విద్యా మరణించిన ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధించే ఉపాధ్యాయులులేక విద్యార్థులు అర్ధంతరంగా బడికి మాను కునే వారని, ఉన్నత చదువులు చదువుకోవటానికి చేతకాక కూలి పనులకు వెళ్లేవారన్నారు. ప్రస్తుతం వైయస్ జగన్ అన్న ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు లేవని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశా లలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిది ద్దారని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న 42వేల పాఠశాలల్లో మొదటి విడత కింద రూ.3,669 కోట్లతో 15,713పాఠశాలలరూపురేఖలు మార్చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి బడికి బాటలు వేయించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి కె దక్కుతుందన్నారు. విద్యార్థు లకు యూనిఫాం, బూట్లు, బెల్టులు, పాఠ్య పుస్తకాలు అందచేస్తున్నామని, నాడు – నేడు రెండో విడత కింద రూ.8వేల కోట్ల ఖర్చుతో 22,344 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ..
అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థుల చదువులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని, అందుకు ఎంత ఖర్చయినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెనకంజ వేయడం లేదని అన్నారు. పుల్లలచెరువు పాఠశాలలో భోజన శాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటా నని, అందుకు అంచనాలు తయారుచేసి వెం టనే తనకు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు.
*గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు*
మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరా జ్యంవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగా ప్రజల వద్దకు పరిపాలన తీసుకొని వెళ్లాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివా లయాలను ఏర్పాటు చేశారని మంత్రి సురేష్ అన్నారు. ప్రభుత్వ పథకాలు అంద రికీ చేరువచేయటానికి వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని, ఈ వ్యవస్థలతో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ లాజర్, జెడ్పీటీసీ వాగ్యానాయక్, వైఎస్సార్ సీపీ పుల్లలచెరువు, యర్రగొండపాలెం మండలాల అధ్యక్షులు బీవీ సుబ్బారెడ్డి, కె.ఓబు లరెడ్డి, ఎంపీటీసీ రాములు, సర్పంచ్ ఓబు లేసు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
రాచగొర్ల సుశీల పిచ్చయ్య, సచివాలయాల మండల కన్వీనర్లు డి.వెంకటేశ్వర్లు, సయ్యద్ జబీవుల్లా, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గాలిరెడ్డి, డైరెక్టర్లు జానకిరఘు, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, ఆవుల రమణారెడ్డి, కేశవరెడ్డి, కె.కాశయ్య, బి.హ నుమంతరావు, లక్ష్మణ్ నాయక్, తహసీల్దార్ కె.దాస్, పీఆర్ డీఈఈ సుబ్బారెడ్డి, ఈఓపీఆర్డీ బాలునాయక్, ఎంఈఓ సామ్యూల్జాన్ లు పాల్గొన్నారు.



