కరెంటు కోతలపై ముండ్లమూరు మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు కరెంట్ కట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పంట పొలాలకు బోరు నీరే దిక్కని, కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ వేంపాడు గ్రామస్తులు విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకుని కొంత సేపు ఆందోళన చేపట్టారు. ముమ్మరంగా మిరప నాట్లు కోరినట్లు ఉన్న సమయంలో ఇదేం పని అంటూ నిరసనకు దిగారు. ఇదేవిధంగా కరెంట్ కోతలు ఉంటే రైతులము అందరం కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు.
