పచ్చదనం# పచ్చదనం కార్యక్రమము తాళ్లూరు మండలం నాగం బోట్లపాలెం లో సుబ్బారెడ్డి సారధ్యంలో మంగళవారం నిర్వహించారు. టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ ….వర్షాలు సకాలంలో పడి వాతావరణం లో సమతుల్యత ఉండాలి అంటే మొక్కలు విరివిగా పెంచి వాతావరణం సమతుల్యతను రక్షించాలి అని అన్నారు. అడవులు రోజుకు రోజు తగ్గి పోతున్నాయి అని, అందుకే వర్షాలు సకాలంలో పడటం లేదు అని అన్నారు. ప్రకృతి రక్షించాలి అని, పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత అని అన్నారు. ప్రతి మొక్కకు ఓసద గుణం ఉంది… కావున అన్ని మొక్కలు ఏదో ఒక విదంగా ఉపయోగ పడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫణీంద్ర రెడ్డి, రమణారెడ్డి, మూర్తి, మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు.



