మాతృమరణాల నివారణకు, హైరిస్క్ ఉన్న గర్భిణులకు
మెరుగైన వైద్యసేవలందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు.
2023 ఆగస్టు 22న ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రసవానికి ముందు ఆ తరువాత కూడా పీహెచ్సీ నుంచి ఇంటికి వెళ్లడానికి తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. హైరిస్క్, తీవ్రమైన రక్తహీనత ఉన్న గర్భిణులను ప్రత్యేక శ్రద్ధతో వైద్యులు పర్యవేక్షిస్తారన్నారు. వారికి ఐరస్ మాత్రలు ఇవ్వడంతో పాటు మూడో నెల నుంచి 9వ నెల వరకు పీహెచ్సీకి తీసుకురావడానికి, తిరిగి ఇంటికి వెళ్లడానికి వాహన సౌకర్యం కల్పిస్తారని వెల్లడించారు. బాలింతలకు హిమోగ్లోబిన్ స్థాయి మెరుగుపరిచేందుకు వివిధ మందులు ఇస్తారన్నారు. బిడ్డ ఎదుగుల తెలుసుకోవడానికి రెండు సార్లు ఏంటినేటల్ స్కాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, టిఫా స్కాన్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తారని, ప్రసవం ఎక్కడ జరిగినా ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నట్లు వివరించారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని పీ.హెచ్.సీ. వైద్యాధికారులకు సిబ్బందికి సూచించారు. పీహెచ్సీల వైద్యాధికారులకు ప్రమాదకర ప్రసవాలకు గురయ్యే గర్భిణులకు సుఖ ప్రసవం జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణా కార్యక్రమం టెలి కాంఫరెన్సెస్ ద్వారా నిర్వహించారు. అత్యవసర సమయంలో అంబులెన్స్లు అందుబాటులో లేకుంటే తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ వాహనం ద్వారా గర్భిణులను ఆస్పత్రికి తరలించాలని సూచించినారు. మీరు 102 కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఈ సేవలను పొందవచ్చునన్నారు. హైరీస్క్ గర్భిణులను గుర్తించడంపై వైద్యాధికారులకు గైనకాలజిస్ట్ శిక్షణ ఇచ్చారు. హైరిస్క్ కలిగిన గర్భిణీ స్త్రీలు రక్తహీనత, బిపి, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, చిన్న వయసుకే గర్భం దాల్చడం, కాన్పు కాన్పుకు ఎడమ లేకపోవడం, మూర్చ తదితర లక్షణాలు కలిగిన వారిని గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
మాతృమరణాల నివారణకు, హైరిస్క్ ఉన్న గర్భిణులకుమెరుగైన వైద్యసేవలందించాలి – జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి
22
Aug