సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం లాభసాటి – మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు

నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవ సాయం లాభసాటిగా మారుతుందని మండల వ్యవసాయాధికారి బి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని శివరామపురం, దారం వారి పాలెం గ్రామాలలో సోమ వారం ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. సాంకేతిక పద్ధతులను పాటించినట్లయితే వ్యవసాయంలో సత్ఫలితాలు సాధించవచ్చు అని ఆయన తెలిపారు. మొక్కజొన్న పంటలో ఫెరమూన్ ఎరలు ఎకరాకు పది చొప్పున లింగాకర్షక బుట్టలను ఉపయోగించి తెగుళ్లను నివారించి మంచి దిగుబడి సాధించవచ్చునని వివరించారు. జిల్లా వనరుల కేంద్రం టెక్నికల్ వ్యవసాయ అధికారి ఏ శైలజారాణి, మరో టెక్నికల్ వ్యవసాయ అధికారి వివి శేషమ్మ, గ్రామ వ్యవసాయ సహాయకులు రాజశేఖర్ రెడ్డి, నాగమల్లేశ్వరి, రైతులు, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *