ఓట్లనమోదుఎన్యూమరేషన్ తీరును పరిశీలించిన దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేష్ కుమార్

కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం గతనెల 21 నుండి ఈ నెల 21వరకు జరిగిన ఓట్లనమోదు ఎన్యూమరేషన్ ప్రక్రియను దర్శినియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేష్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎన్యూమరేష న్ లో తొలగించిన ఎక్స్చైర్డ్(మృతిచెందినవారి ఓటు సక్రమంగా జరిగినదా లేదా అన్న విషయాన్ని తాళ్లూరులో పలువురి నివాసాలకు స్వయంగా వెళ్లి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఎన్యూనరేషన్ ను ఏవిధంగా జరిగిందో తెలుసుకున్నారు. ఎన్యూమరేష న్లో మండలంలో 919 ఓట్లు తొలగించినట్లు గుర్తించారు.613 మంది ఓటర్లు ఎక్చైర్డ్ (మృతి) అయినట్లు, 218 మంది ఓట్లు డబుల్ ఎంట్రీగా వుండగా తొలగించిన ట్లు తెలిపారు. 88 మంది ఓట్లను షిఫ్ట్ చేయటం జరిగిందన్నారు. ఆన్లైన్ నందు వచ్చిన మార్పులు, చేర్పులు, తొలగింపుకు అభ్యంతరాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతగల ఓట్ల జాబితాలను సిద్దం చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.వి.ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పివిఎస్ఆర్ మూర్తి, బియల్వో ఎలిషా తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *