తాళ్లూరు మండలపరిషత్ కార్యాలయం ఇంచార్జి ఎంపీడీ వోగా ఏట్టకేలకు సంతనూతలపాడు ఎంపీడీవో కె. రాఘవేంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎంపీడీవో, సిబ్బంది లేక ప్రజలు పడుతుతున్న ఇబ్బందులను జిల్లా అధికారులు గమనించి స్పందించారు. జడ్పీసీవో జాలిరెడ్డి ఆదేశంలో ఇంచార్జి ఎంపీడీవోగా కె. రాఘవేంద్ర బాధ్యతలు చేట్టారు. ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్ వర్గీయులు మండల పరిషత్ పాలక వర్గంకు, ఇంచార్జిగా వున్న మద్దిపాడుఎంపీడీవో వై.శ్రీనివాసరావుకు మద్య సఖ్యత కొరవడింది. పలు మార్లు ఎంపీడీవోపై నిరసన తెలియజేస్తూ …ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, ఎంపీడీవోను ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాధులు చేశారు. దీంతోకలెక్టర్ దినేష్ కుమార్ తాళ్లూరుకు మరొకరిని ఇంచార్జిగా నియమించాలని ఆదేశిం చటంతో జడ్పీసీవో ఈ నెల19వ తేదీన ఇంచార్జిగా వున్న ఎంపీడీవో వై.శ్రీనివాసరా వునుస్థానంలో సంతనూతలపాడు ఎంపీడీవో కె.రాఘవేంద్రను తాళ్లూరుఇంచార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇంచార్జి ఎంపీడీవోను శ్రీనివాసరావును మార్చిరోజులు కావస్తున్నా కొత్త ఎంపీడీవో బాధ్యతలు తీసుకోక పోవటం, గతంలో వున్న ఎంపీడీవో వై.శ్రీనివాసరావు కార్యాలయం వైపుకన్నెత్తి చూడక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, కార్యాలయ పనులు స్థంభించాయి. సమస్యనుగమనించిన జిల్లా అధికారుల జోక్యం చేసుకుని తక్షణమే తాళ్లూరు ఇంచార్జి ఎం పీడీవోగా విధుల్లో చేరాలని ఆదేశించటంతో ఇంచార్జి ఎంపీడీవో కె.రాఘవేంద్ర సోమవారం బాధ్య తలు చేపట్టారు.
