ప్రకాశం జిల్లా దర్శి నగరం లోని కాశీఅన్నపూర్ణాదేవి మాతా సమేత కాశీవిశ్వేశ్వ రస్వామి రథశాలను దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోమవారం రి ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్య క్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కార్య క్రమంలో కౌన్సిలర్ వీసీ రెడ్డి, రెడ్డి, సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, ఎదురు శ్రీనివాస్ రెడ్డి, శివాలయ ట్రస్ట్ బోర్డ్ ప్రతినిధి నారపుశెట్టి శివ తదితరులు పాల్గొ న్నారు.


