సాగు ఖర్చును తగ్గించుకుని నికర ఆదాయాన్ని పొందాలని ఆత్మ పీడీ, డిఆర్సీ హెడ్ కె. అన్నపూర్ణ కోరారు. దర్శి మండలం బొట్లపాలెం రైతు భరోసా కేంద్రం పరధిలో ఆత్మ ఓరింటెడ్ పధకంలో బాగంగా వరి సాగు చేసిన రైతులకు జీవన ఎరువులైన పీ ఎస్ బి (అధిక భాస్వరం కలిగిన జీవన ఎరువు), అజో స్పైరెల్లమ్ రైతులకు పంపిణీ చేసారు. రైతులతో డిఆర్సీ హెడ్ కె. అన్నపూర్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జీవన ఎరువుల వాడకం పెంపు వలన రైతులు రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకోవటం వలన నికర ఆదాయం పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా బసి రెడ్డి పల్లెలో రైతు భరోసా కేంద్రంలో ప్రత్తి సాగు చేసిన రైతులకు లింగాకర్షక బుట్టలని ద్వారా గులాబి రంగు పురుగుల ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు. లింగాకర్షక బుట్టలు ఉచితంగా పంపిణీ చేసారు. అనంతరం ఎఆర్ఎస్ శాస్త్రవెత్త రాజేష్ చౌదరితో కలసి బసి రెడ్డి పల్లె, చందలూరులలో పంటను పరిశీలించారు. వ్యవసాయాధికారి బాల క్రిష్ణా నాయక్, డి.ఆర్. సి, వ్యవసాయాధికారులు శైలజా రాణి. వి. విశేషమ్మ లు పాల్గోన్నారు.



