సంక్షేమాన్ని ప్రజలకు అందిచడమే లక్ష్యం – దర్శి పట్టణం లో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహణ – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

రాష్ట్రం లోని ప్రజల కు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది తెలుసు కోవటం కోసం జగనన్నా ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ను ఏర్పాటు చేసిందని ఎమెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ అన్నారు. దర్శి ఎస్. సి కాలనీ లో రెండవ రోజు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ … అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును లబ్ధిదారులకు వివరించారు .కార్యక్రమం లో ఆయన వెంట దర్శి ఎంపీపీ గొల్లపాటి సుధా అచ్చయ్య, ఎ. యం. సి చైర్మన్ మిల్లర్ బుజ్జి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, గోపు ఎర్రయ్య కుంటా అచ్చరావు, చిన్న స్టీవెన్, సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, సుశీల ప్రతాప్ కట్టే కోట హరీష్, కరిపి రెడ్డి సు బ్బారెడ్డి, రవి, ఎ. యం. సిడైరెక్టర్ లు, వెంకటేశ్వరెడ్డి, భవనం మురళి కృష్ణ రెడ్డి, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *