ఏపీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఎంతో ఉందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. దర్శి ఎమ్మెల్యే కార్యాలయంలో జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, గృ హసారథులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టే రాష్ట్రం స అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందనిచెప్పారు. బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకో వాలని సూచించారు. దర్శి, తాళ్లూరు ,కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల జేసీఎస్ కన్వీ నర్లు బత్తినేని వెంకటేశ్వర్లు, యాడిక శ్రీనివాసరెడ్డి ,మేరువ సుబ్బారెడ్డి, గుంటు పోలయ్య, మేడికొండ జయంతి, నగరపంచాయతీ జేసీఎస్ కన్వీనర్ ఎదురుకోటిరెడ్డి పాల్గొన్నారు.


