కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం -జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి – దర్శి నియోజకవర్గ సమావేశం నిర్వహణ

కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి కొండా రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలాగా ఆదుకుంటామని, అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా కల్పిస్తామని అన్నారని గుర్తు చేసారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టలు తెచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పలు పోర్టులు, ప్రభుత్వరంగా సంస్థల ఆస్తులు ను తమకు అనుకూలు ర కు కట్టా బెట్టిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వొచ్చి పలు వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు. సీపీ ఎస్ రద్దు, వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. నా లుగున్నర సంవత్సరాలు కాలం లో చేసింది ఏమి లేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ దెబ్బతిని నీరు వృధాగా సముద్రం పాలు అవుతుంటే గేట్ కూడా పెట్టలేని ముఖ్య
మంత్రి మూడు రాజధానులు కడతానని అనటం విడ్డురంగా ఉందన్నారు. పుట్లూరి కొండా రెడ్డి మాట్లాడుతూ …కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో సమన్వయ కమిటీ సభ్యులు కర్నా పుల్లారెడ్డి, కాటం రమణారెడ్డి , పౌలెస్ ,సాయి కృష్ణ, కోటయ్య నరసింహ శంకర్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *