రాజకీయ పార్టీల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ప్రజలు పెట్టుకున్న క్లెయిమ్స్ వివరాలు అన్నీ ప్రజలందరూ వీక్షించేలా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) ముఖేష్ కుమార్ మీనా

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ప్రజలు పెట్టుకున్న క్లెయిమ్స్ వివరాలు అన్నీ ప్రజలందరూ వీక్షించేలా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) శ్రీ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అమరావతి నుంచి అన్ని జిల్లాల డి.ఆర్.ఓ.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మంగళవారం నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై సమావేశాలు నిర్వహిస్తున్నందున వారు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ఆ సమావేశాలలో రికార్డు చేసిన మినిట్స్ వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. పాత బి.యు., సి.యు.లను త్వరగా పూనేకు పంపించాలని, అదేవిధంగా బెంగుళూరు, ఉత్తరాఖండ్ నుండి వచ్చే నెల 15 నాటికి కొత్త యూనిట్లను జిల్లాలకు తెచ్చుకునేలా చర్యలను వేగవంతం చేయాలని సి.ఈ.ఓ. ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఆర్. శ్రీలత, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *