ఘనంగా తెలుగు భాషా ,దినోత్సవం నిర్వహణ -అమ్మ భాషకు వందనం

దర్శి  నియోజక వర్గం లో తెలుగు భాషా , జాతీయ క్రీడ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాతృభాష గొప్పతనాన్ని తెలుపుతూ సాంస్కృతిక కార్యక్ర మాలు ఏర్పాటు చేశారు. వక్తలు తెలుగు భాష మాధుర్యాన్ని నేటి తరానికి వివ రించారు. మనం ఎంత ఉన్నత స్థితికి చేరినా కమ్మనైన అమ్మ భాషను మరవద్దని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థులు తెలుగుతల్లి, కవుల వేషధార ణతో ఆకట్టుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *