గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వేలో తప్పులు దొర్లకుండా గ్రామ రెవెన్యూ అధికారులు జాగ్రత్తలు పాటించాలని తహసీల్దార్ కె.వి.ప్రసాద్ చెప్పారు. తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో వీఆరోఓ, విలేజ్ సర్వేయర్లతో మంగ ళవారం సమావేశం జరిగింది. రెవెన్యూ రికార్డులను ఆర్డీఓఆర్, ఎఫ్ఎల్ఆర్, 1-బి ల ఆధారంగా భూముల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాకే భూమియజమాని పై నిర్దారణ కు రావాలని చెప్పారు. సాగు చేసుకుంటున్న యజ మానిని కాదని ఇతరుల పేరున భూమి ఆన్లైన్ లో ఉంటే ఎవరు అసలు భూహక్కుదారులో క్షేత్రస్థా యిలో సమీప రైతులతో, గ్రామపెద్ద లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామాల్లో రీసర్వేను వేగవం తంగా పూర్తిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి కిషోర్, సర్వే డీటీ ప్రశాంత్, కార్యా లయ సీనియర్ అసిస్టెంట్ పీఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
భూముల రీసర్వేలో తప్పులు దొర్లనివ్వొద్దు -తహసీల్దార్ కె.వి.ప్రసాద్
30
Aug