అందుబాటులో అద్దెకు యంత్రసేవా పరికరాలు -మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు

డాక్టర్ వైఎస్సాఆర్ యంత్రసేవాపథకం ద్వారా మంజూరైన యంత్రసేవా పరికరాలను రైతాంగం అద్దెకు తీసుకుని వ్యవసాయ సాగు పనులు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు మంగళ వారం తెలిపారు. తాళ్లూరు మండలంలో రూ.కోటి43లక్షల 79వేల, 365 లు విలువగల 160 రకాల యంత్రపరికరాలను కొనుగోలు చేసి రైతు భరోసా కేంద్రాల వద్ద అందు బాటులో ఉన్నాయన్నారు. రైతు భరోసాకేంద్రాల్లోని సీహెచ్సీ గ్రూపుల ద్వారా ట్రాక్టర్లు, ట్రాలీలు, రోటావేటర్లు, బేలర్లు, గొర్రులు, నాగళ్లు, వీల్స్, స్ప్రేయర్లు, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు, చాప కట్టర్లు, లెవలింగ్ బ్లేడ్లు, మల్టీ క్రాప్ త్రిషర్లు, ఫీడర్లు, కేజీ ఫీల్స్ వంటి 160 రకాల యాంత్రిక పరికరాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *