లక్ష్య సాధనలో భాగంగా సిబ్బందికి కేటాయించిన వివిధ రకాల పనులను, సకాలంలో పూర్తి చేయాలని దర్శి క్లష్టర్ ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవి అన్నారు. తాళ్లూరు వైఎస్సార్ కేపీ కార్యాలయంలో మంగళవారం సిబ్బంది పనితీరుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి క్లష్టర్ ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవి మాట్లాడుతూ… వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు గాను 35శాతం రాయితీపై బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పెరటికోళ్ళ పెంపకంలో భాగంగా 5 వేలకే ఒక యూనిట్ కోళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కుట్టుమిషన్ పట్ల ఆసక్తి ఉన్న వారికి 56 వేలకే నాలుగు మిషన్లు అందజేస్తామన్నారు. అర్హులను గుర్తించి వారికి ఆయా పథకాలు అందేలా చూడాలన్నారు. గ్రామ సంఘ సమావేశాలు నిర్వహించి రిటర్న్ దాఖలు చేయాలన్నారు. జగనన్న తోడు లబ్దిదారులను గుర్తించి రుణాలు ఇప్పించాలన్నారు. ఉన్నతి రుణాలు తీసుకున్న మహిళలు ఆర్ధిక ఇబ్బందులు వలన తిరిగి చెల్లించడంలో వెనుకబడితే ఓటీఎస్ ద్వారా జమ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏపీఎం పి. దేవరాజు, సీసీ కోటేశ్వరమ్మ, వీఓఏలు పాల్గొన్నారు.
సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలి -దర్శి క్లష్టర్ ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవి
30
Aug