కురిచేడు మండలంలోని పడమరనాయుడుపాలెం గ్రామంలో చర్చికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ బుధవారం అందజేశారు. వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ షేక్ సైదా, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ గాలిముట్టు దేవప్రసాదు ఆధ్వర్యంలో పడమరనా యుడుపాలెం గ్రామస్తులకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆర్థికసాయం అందించారు. ఎమ్మెల్యేకు చర్చి నిర్వా హకులు కృతజ్ఞతలు తెలిపారు. వేమా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
