చౌడయ్య కుటుంబానికి ఆర్ఆర్ ఫౌండేషన్ చేయూత

దర్శి గ్రామానికి చెందిన పూజల చౌడయ్య అనే వ్యక్తి తన పుట్టుకతోనే వికలాంగుడు . రెండు కాళ్లకు పోలియో కుటుంబ భారం అంతా తన భార్య కష్టపడి పనికెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకునేది. ఆ ఏరియాలో పనులు తక్కువ కావడంతో కుటుంబం నడుపటానికి చాలా ఇబ్బందికరంగా మారింది . వాళ్లకి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఆ చిన్నారుల ఆకలి తీర్చడం కోసం.. గుంటూరు జిల్లా తాటికొండ మండలం, మోతడక గ్రామానికి పనులు కోసం వెళ్లారు. అయితే కాలం వారిపై పగ పట్టిందో.. వాళ్ల కర్మ ఫలము కానీ యాక్సిడెంట్ లో ఆమె స్పాట్లో మృతి చెందినది. చౌడయ్యకి పోలియో కాలు ఒక కాలు తీసేసారు… కుటుంబాన్ని తన పిల్లలను చూసుకునేది భార్య మృతితో కుటుంబానికి పూట కలవటమే కష్టంగా మారినది. ఇద్దరు చిన్నపిల్లలతో కాలు లేని తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు.
ఈ దుస్థితి ఆర్ఆర్ ఫౌండేషన్ దృష్టికి రావడం తో స్పందించి వారికి 7 నెలలకు సరిపడా నిత్య అవసర సరుకులు, రైస్ బ్యాగులు అందజేసారు. కార్యక్రమానికి సెల్వం, తంగరాజు, బోసు,ప్రదీప్,కుమారు,రంజిత్,ప్రశాంత్, సాయి సహకరించారు. ఈ కార్యక్రమం లో “కోటవరపాలెం బల్లికురవ మండలం బాపట్ల కి చెందిన “గాదె కోటేశ్వరావు ” ఆర్. ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.”

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *