మాగుంట కుటుంబం గత 40 సంవత్సరాలకుపైగా మద్యం వ్యాపారం చేస్తుండగా, ప్రస్తుతం సంబంధం లేని కేసుల్లో వారిని ఇరికించాలనియత్నిస్తున్నారని, అందులో భాగమే మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ అని ఓం గోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీని వాసరెడ్డి అన్నారు. బెయిల్ పొందిన తర్వాత తొలిసారి ఒంగోలు వచ్చిన మాగుంట రాఘవ రెడ్డి గురువారం స్థానిక బాలినేని నివాసానికి వెళ్లారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డిని కలవగా వారు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని మాగుంట రాఘవరెడ్డి దుశ్శ లువాతో సత్కరించారు. కొద్దిసేపు రాఘవరె డ్డితో చర్చించిన అనంతరం మీడియాతో బాలినేని మాట్లాడారు. మాగుంట కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎ స్సార్ సీపీలో ఉన్నా మాగుంట కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకు మాగుంట కుటుంబం సేవలు అవసరమన్నారు. మాగుం ట కుటుంబం నుంచి రాఘవరెడ్డి రాజకీయా ల్లోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. రాజకీయాల్లో ఆయన రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు బాలినేని తెలిపారు. రాఘవరెడ్డిపై నమోదైన కేసు కూడా త్వరలోనే పరిష్కారమ వుతుందన్నారు. భవిష్యత్తులో వ్యాపార పరంగా, రాజకీయంగా కూడా వారు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు బాలినేని పేర్కొన్నారు. ముందుగా వల్లూరమ్మ దేవాలయం తో పాటు పలు దేవాలయాల్లో ఎంపీ మాగుండ శ్రీనివాస రెడ్డి , రాఘవ రెడ్డి లు ప్రత్యేక పూజలు చేశారు . వారిని జిల్లాలోని వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సన్మానించారు. ఘన స్వాగతం పలికారు.




