అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలిపిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కె దక్కుతుందని మండల జెసిఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి అన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో శనివారం వైసీపీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక బస్టాండ్ సెంటర్లో వైయస్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి మార్గదర్శకుడు వైయస్సార్ అని, ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ పాలన కంటే రెండు అడుగులు ముందుకు వేసి సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి హృదయాల్లో చిరస్థాయిగా వైయస్ నిలిచారన్నారు. ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్నదే ధ్యేయంతో దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పని చేశారని కొనియాడారు. రైతు సంక్షేమ కోసం వైయస్ రైతాంగానికి పెద్ద పీట వేశారని కొనియాడారు. నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆయన తనయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాల వ్యవస్థకు రూపకల్పన చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ సీనియర్ నాయకులు మేడికొండ శేషగిరిరావు, మండల బీసీ సంఘం అధ్యక్షులు దాసరి మురళి, సోషల్ మీడియా మండల కన్వీనర్ మందలపు లింగారావు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మందల అశోక్, రేషన్ డీలర్ కిలారి ఆదినారాయణ, మందలపు శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.
