టమోటా లారీ బోల్తా – రూ.లక్ష విలువ చేసే టమోటాలు నేలపాలు – చెట్టు ను ఢీకొన్న కారు

టమోటా లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన మండలం లోని పోలవరం మలుపు వద్ద శుక్రవారం చోటుచే సుకుంది. కడప నుంచి మార్టూరు వెళ్తున్న టమోటా లారీ దర్శి – అద్దంకి ప్రధాన రహదారిపై బోల్తాపడటంతో రూ.లక్ష విలువచేసే టమోటాలు నేలపాలయ్యాయి. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు టమోటాల కోసం ఎగబడి అందిన కాడికి తీసుకెళ్లారు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
*చెట్టును ఢీకొన్న కారు… పలువురికి గాయాలు*
దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో రెడ్డి నగర్ ఉల్లగల్లు మధ్య కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పొదిలి నుండి అద్దంకి వైపు వెళ్తున్న మార్కాపురానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్నారు. కారు డ్రైవర్ కు వెనక ఉన్నవారికి స్వల్ప గాయాలు కాగా ..ముందువైపు కూర్చున్న వ్యక్తికి కాలు విరిగింది .108 సిబ్బంది సకాలంలో వాహనం వద్దకు చేరుకొని కాలు విరిగిన వ్యక్తిని కారు నుంచి బయటకు అతి కష్టం మీద  తీసి 108లో వైద్యశాలకు తరలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *