పిచ్చిరెడ్డి సేవలు మరువలేనివి -కాపా పిచ్చిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి

వైఎస్సార్సీపీ సీనియర్ నాయ కుడు, బొప్పూడివారిపాలెం సొసైటీ మాజీ అధ్య క్షుడు కాపా పిచ్చిరెడ్డి పార్టీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి కొనియాడారు. జమ్మలమడకలో శుక్ర వారం కాపా పిచ్చిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ అభివృద్ధిలో పిచ్చిరెడ్డిది కీలకపాత్ర అన్నారు. పార్టీ ప్రారంభం నుంచి శక్తివంచన లేకుండా కృషిచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. సుదీర్ఘ కాలం సొసైటీ చైర్మన్ గా పని చేసిన కాపా పిచ్చిరెడ్డి రైతుల సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు. ముందుగా స్థానిక బస్టాండ్ సెంటర్లో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బూచేపల్లి నందిని, కాపా రమణారెడ్డి, సుగుణ, కాపా నరసింహారెడ్డి, కాపా రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, వైస్ ఎంపీపీ బంకా రమణమ్మనాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సూదిదేవర అం జయ్య, రెడ్డిసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ సంఘం మండల మాజీ అధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి, పసుపుగల్లు ఉపసర్పంచ్ బిజ్జం జ్యోతికృష్ణారెడ్డి, నాయకులు మేదరమెట్ల కోదండ రామయ్య, అబ్బని అంజిరెడ్డి, గాదె నాసరరెడ్డి, సోమేపల్లి సుబ్బయ్య, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *