మిరప పంటలో నీటి ఎద్దడిని తట్టుకునే జీవన ఎరువులు వాడాలి

మిరప పంటలలో నీటి ఎద్దడిని తట్టుకొని వేరు వ్యవస్థ బాగా పెరుగుటకు మరియు బాశ్వరం, సూక్ష్మ పోషకాలు, హార్మోన్లు అందించే జీవన ఎరువు లను వాడాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు ఏ శైలజ రాణి, వివి శేషమ్మ లు అన్నారు. మండలంలోని ఉమామహేశ్వర పురం గ్రామంలో శనివారం సాగు చేసిన పేర్లను జిల్లా వనరుల వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. తగు సూచనలు చేశారు. ఆత్మ ఫార్మర్ ఓరియెంటెడ్ పథకంలో భాగంగా వారికి ఉచితంగా జీవన ఎరువులను పంపిణీ చేశారు. మొక్కకు లభ్యం కాని స్థితిలో ఉన్న బాశ్వరాన్ని కరిగించి మొక్కకు అందించటం పాటు, బెట్ట పరిస్థితులను, తెగుళ్లను, తట్టుకునే శక్తిని పెంచుతుంది. అంతేగాక కొన్ని రకాల హార్మోన్లు, మరియు సూక్ష్మ పోషకాలు, జింకు ,మాంగనీసు , ఐరన్, కాపర్ ,కోబాల్ట్ , మరియు మిక్కిలిచినం సూక్ష్మ పోషకాలను అందిస్తుంది. ఈ విధానాన్ని రైతులు పొలంలో ప్రయోగాత్మకంగా చేసి పంపించడం జరిగింది. వాడాల్సిన విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి యం రవి వెంకన్న బాబు, వి ఏ ఏ డి రాము, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *