పంటల సాగుపై పరిశీలన

ఖరీఫ్లో రైతులు సాగు చేసిన పంటలను సర్వే నెంబర్ల ఆధారంగా పరిశీలించి నట్టు జిల్లా వ్యవసాయ అధికారి( ఒంగోలు) ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ముండ్లమూరు వేంపాడు గ్రామాలలో రైతులు సాగుచేసిన ఈ క్రాఫ్ లో నమోదు చేసిన పంటలను ఆదివారం ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 ఖరీఫ్ లో ఈ క్రాఫ్ కు సంబంధించి రాష్ట్ర కార్యాలయం నుండి ర్యామ్డంగా కొన్ని సర్వే నెంబర్లు ఆధారంగా పంటల వివరాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. సాగునీటి వసతి పంటల సాగు విధానాలపై ఆరా తీశారు. రైతులు పంట సాగు తో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకుంటేనే పంట నమోదు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు.2023 ఖరీఫ్ కు సంబంధించి ఈనెల 15వ తేదీ లోపు ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకుంటేనే లేదంటే పంట నష్ట పరిహారం వర్తించదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండి ఫారుక్, వీఆర్వో కే దయానందం, సర్వేయర్ కళ్యాణ్, వి ఏ ఏ శోభారాణి, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *