ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆదివారం మండలంలోని తురకపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త అన్నపురెడ్డి అంజిరెడ్డి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గ్రామంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎంపీపీ, రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి పి.మధుసూదనరెడ్డి, మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, గోళ్ళపాటి మోషే, రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి ఐవి సుబ్బారెడ్డి, దోసకాయలపాడు సర్పంచ్ కోట శివలక్ష్మి వెంకటరామిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు చిన్న నాగిరెడ్డి, గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

