ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరు ఆదర్శ పాఠశాల చెందిన విద్యార్థిని విద్యార్థులు దర్శి నియోజకవర్గ స్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానం సాధించారు. దర్శి నియోజకవర్గ స్థాయిలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ చాటిన గితేంద్రకు రూ. పదివేల రూపాయల నగదు బహుమానంతో పాటు జ్ఞాపికను టాలెంట్ టెస్ట్ కోఆర్డినేటర్ రంగ సాయి రెడ్డి అందించారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వి. కీర్తనకు రూ. 1000 రూపాయల నజరాలతో పాటు చిరు జ్ఞాపికను అందించారు. అనంతరం స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కే. పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. తల్లిదండ్రుల కలలను సహకారం చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

