తెలుగుదేశం పార్టీ జాతీయ
అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తాళ్లూరు మండల తెలుగు దేశం పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కార్యదర్శి ఎస్ కొండారెడ్డి, మానం రమేష్ బాబు, వల్లభనేని సుబ్బయ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్యదర్శి ఎస్. కె పెద్ద కాలేషావలి (బడే), తదితరుల ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రమైన తాళ్లూరులో ప్రధాన రహదారిపై అక్రమ అరెస్టుకు నిరసనగా నల్ల బ్రాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ …స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే నెపంతో మాజీ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ను నంద్యాలలో అదుపులోకి తీసుకోవడం విడ్డూరంగా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎస్.కె మీరా మొహిద్దిన్, మండల తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు పిన్నిక రమేష్, బీసీ సంఘాల సీనియర్ నాయకులు సూరిబాబు, రాచకొండ వెంకట్రావు, విద్యాసాగర్, నాగార్జున రెడ్డి, కోటిరెడ్డి, దోసకాయలపాడు మాజీ సర్పంచ్ సత్యం, శ్రీను, తిరుపతి రెడ్డి, ఇతర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
