చంద్రబాబు అరెస్టు జగన్ ఉన్మాదానికి పరాకాష్ట – పోలీసులు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు అరెస్టు ఉన్మాదానికి పరాకాష్ట – ప్రతిపక్ష నేత అరెస్టుకు పోలీసులు గవర్నర్ అనుమతి తీసుకున్నారా? -తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, డాక్టర్ నూకసాని బాలాజీ,

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వైకాపా ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర పరిపాలన జరగడం లేదనడానికి చంద్రబాబు అరెస్టు నిదర్శనం అని నూకసాని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు లక్షల మందికి పైగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అందులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే వంకతో తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం శోచనీయమని చంద్రబాబు అరెస్టు సీఎం జగన్ కే రివర్స్ అవుతుందని ఇది వైకాపా నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలని నూకసాని ఎద్దేవా చేశారు.ఎలాంటి ఆధారాలు చూపకుండా అర్థరాత్రి సమయంలో చంద్రబాబు గారిని అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయమని నూకసాని విమర్శించారు. ఏ తప్పు చేయని నాయకులను జైల్లో పెట్టి వేధించడం చూస్తుంటే ఏపీలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని నూకసాని ఆరోపించారు.చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసిందని నూకసాని మండిపడ్డారు. నిరంకుశత్వం మితిమీరినప్పుడు తిరుగుబాటు అనివార్యం అవుతుందని, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ చర్యకు ప్రజా కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని నూకసాని విమర్శించారు.శాసనసభ ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయాలంటే పోలీసులు గవర్నర్ అనుమతి తీసుకోవాలని, అటువంటి అనుమతులు లేకుండానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో దౌర్జన్య దుర్మార్గపు పాలన సాగుతుందని నూకసాని విమర్శించారు.చంద్రబాబు అరెస్టును రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తూ తీవ్ర నిరసనలు చేస్తున్నారని నూకసాని తెలిపారు. సంబంధంలేని విషయంలో అక్రమ కేసులు నమోదు చేశారని, న్యాయం కోసం పోరాటం చేస్తామని నీతి నిజాయితీతో చంద్రబాబు బయటకు వస్తారని నూకసాని పేర్కొన్నారు.పోలీసులు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య రాజ్యంలో పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరు సమర్ధనీయం కాదని , చంద్రబాబును ఎలాగైనా జైల్లో ఉంచాలన్నదే జగన్ కుట్ర అని నూకసాని ఆరోపించారు. ఈ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని నూకసాని స్పష్టం చేశారు.చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలని లేకపోతే న్యాయపోరాటం చేసి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని నూకసాని తెలిపారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *