రాజీ చేసుకుంటే ఇబ్బందులుండవ్ – జూనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి

కేసుల్లో ఇబ్బందులు పడుతూ కోర్టులు చుట్టూ తిరగకుండా రాజీ చేసుకుంటే ఇద్దరికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని జూనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి అన్నారు. దర్శి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వ హించారు. ఈ సందర్భంగా కక్షిదారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.జూనియర్ సివిల్ జడ్జి సరస్వతి మాట్లాడుతూ ….కోర్టులు చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా రాజీ చేసుకుంటే ఇద్దరూ గెలిచినట్లే అవు తుందన్నారు. రాజీ అంటే రాజమార్గం లాంటిదని చెప్పారు. క్షణకాలిక ఆవేశంలో జరిగిన తప్పులకు క్షమాగుణంతో రాజీ మార్గం ఎంచుకోవాలని సూచించారు. అనంతరం 148 క్రిమినల్ కేసులు, 8 సివిల్ కేసులు, జూన్ నెల నుండి ఇప్పటి వరకు 606పెట్టీ కేసులు రాజీలు చేశారు. సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బొటుకు గంగాధర్, న్యాయ వాదులు బి.చెన్నకేశవులు, ఎం ఆదినారాయణ తది తరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *