విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి – ఫేస్ కళాశాలలో బి.టెక్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం

విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుని మంచి ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఫౌండర్ ఆఫ్ క్రాస్ బోర్డర్ బాధ్యులు పేరిచర్ల సుబ్బరాజు అన్నారు. కళాశాలలో శనివారం బి.టెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పేరిచర్ల సుబ్బరాజు మాట్లాడుతూ… వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించిందుకొనేందుకు అవసరమైన అన్ని టెక్నికల్ సపోర్ట్ కళాశాలలో ఉన్నాయని చక్కగా ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ… మంచి కాలేజిని ఆప్షన్లో ఎంచుకుని అడ్మిషన్ పొందిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చటానికి ప్రతి బ్రాంచి మంచి అధ్యాపకులు, అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఉన్నాయని ఉపయోగించుకుని మంచి మార్కులు, టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించి మంచి ఉద్యోగం పొంది ఆర్థికంగా స్థిరపడి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీవికీ మూర్తి. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ డీన్ కె రూప లక్కేష్, విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన సానుకూల ఆలోచనలతో రాణిస్తే మంచి అవకాశాలు పొందుతారని చెప్పారు. అందుకు విద్యార్థులు తమ వంతు కృషి చెయ్యాల్సిన విధానాలను వివరించారు. కార్యక్రమంలో ప్రథమ సంవత్సరం విభాగాధిపతి రవీంద్ర. స్టూడెండ్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, ఎఓ రమణబాబు, వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *