ఈ క్రాప్ లో పంటల నమోదు వివరాలునిక్కచ్చిగా తప్పులు లేకుండా నమోదు చేయాలని ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. 2023 ఖరీఫ్ సీజన్లో ఈ – క్రాప్ పంట నమోదు ప్రక్రియను పరిశీలనా కార్యక్రమం శుక్రవారం మండలంలోని రెడ్డి సాగర్, అయ్యల పాలెం, వెలుగు వారి పాలెం, గ్రామాలలో ఆయన పర్యటించి పరిశీలించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడుతూ…. ఖరీఫ్ పంటల నమోదు వివరాలు క్షేత్రంలో వేయబడిన పంటలతో సరి పోలే విధంగా ఉండాలని ఆయన తెలిపారు. విస్తీర్ణం, పంట, తదితరి అంశాలను నిక్కచ్చిగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. 2023 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 3011 హెక్టార్ల భూమిపంటల వివరాలను నమోదు చేసినట్లు, సెప్టెంబర్ 15వ తేదీ లోపు మిగతా ప్రక్రియను పూర్తి చేయాలని మండల వ్యవసాయ అధికారి బి.ప్రసాద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

