చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష -భగ్నం చేసిన పోలీసులు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాళ్లూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు . తాళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబులరెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కార్యదర్శులు ఎస్ కొండారెడ్డి, మానం రమేష్ బాబు తదితరులు ఆధ్వర్యంలో తాళ్లూరు లోని ఒంగోలు బస్టాండ్ వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడుని ఇరికించి అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తూ , నినాదాలు చేస్తూ, ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక ఎస్సై బి ప్రేమ కుమార్ తన పోలీసు సిబ్బందితో నిరాహార దీక్ష శిబిరానికి చేరుకొని అనుమతులు లేకుండా ఇలాంటి ఆందోళన చేపట్టరాదని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించి వారిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు పిన్నిక రమేష్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాచకొండ వెంకట్రావు, వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సూరిబాబు,మైనార్టీ నాయకులు యస్. కె. ఖాసీం సైదా(వలి),విద్యాసాగర్, కోటిరెడ్డి, నాగార్జునరెడ్డి, సత్యం, హుస్సేన్, అన్వర్ బాషా, శ్రీను,మండల టి. డి. పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *