జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి నుండి ఇరువురు యువకులు సైకిల్ యాత్ర చేపట్టారు. బికాస్ మహతో, లాల్ బిహారీ మహతో, యువకులు ఆయా రాష్ట్రాలలోని ఆచారాలు, సాంప్రదాయాలు, ఉద్యోగాలు, ప్రజల స్థితిగతులు, వ్యవసాయ పంటల వివరాలు, తెలుసుకునేందుకు బయలుదేరిన యువకులు ఒరిస్సా రాష్ట్రం, చతిస్గడ్ రాష్ట్రాలు పర్యటించి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం విజయవాడలో మీదుగా ముండ్లమూరు కు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర వారి తో చర్చించగా ఇండియాలోని పలు రాష్ట్రాలలో ఆచార సాంప్రదాయ వ్యవహారాలను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టినట్లు తెలిపారు.అనంతరం కడపకు బయలుదేరి వెళ్లారు. అక్కడనుండి ఢిల్లీ చేరుకుంటామని తెలిపారు.
