ముండ్లమూరు మండలంలోని పెద్దరావిపాడు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ధారా శ్రీనివాసరావు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమన్నారు. నిబద్ధతతో పని చేసి విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. జిల్లాస్థాయి ప్రతిభ పురస్కారం అందుకోవడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి శ్రీమన్నారాయణ, మంచు హనుమంతరావు, కొమ్మాలపాటి బుజ్జి, బండారు చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.
