ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ప్రభుత్వ నూతనంగా మంజూరు చేసిన 38 మందికి పింఛన్లను గ్రామ సర్పంచి వరగాని బాల సుందర రావు, ఉపసర్పంచి బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హత ప్రామాణికంగా కుల మత రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పేదల పక్షాన ప్రభుత్వం అధికారులు నిలబడి అర్హులకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడం మనమందరం గర్వించదగ్గ విషయం అన్నారు. ఎవరైనా అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందకపోతే నేరుగా సచివాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఆధారంగా వివరాలు ఆధారంగా విచారణ చేసి అర్హులు ఉంటే పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పింఛన్దారులు పాల్గొన్నారు.
