టిటిపి, జనసేన పార్టీల పొత్తు ఎప్పటి నుండే ఉన్నదని తిరిగి ఆ పొత్తుకు కొత్త కలరింగ్ ఇవ్వటం వంటిదే అని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రా రెడ్డి అన్నారు. అమరావతి నుండి వైఎస్సార్ కడప వెళ్తూ మార్గమధ్యలో శ్రీ సాయిలక్ష్మి అల్పాహార హోటల్ వద్ద విశ్రాంతి నిమిత్తం ఆగారు. సందర్భంగా జర్నలిస్ట్ డిజిటల్ మీడియా విలేకరి ఎమ్మెల్సీని పలకరించగా ఆయన మాట్లాడుత బిజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ నేడు టిడిపితో కలసి ఎన్నికలకు వెళ్లానని ప్రకటించటం ఆయనకు బీజేపీతో సరియైన ప్యాకేజి రాక యూటర్న్ తీసుకుని పూర్తి స్థాయిలో ప్యాకేజి కోసం ప్రయత్నించినట్లు ప్రజలు
చర్చించుకుంటున్నట్లు చెప్పారు. ఇన్నాళ్లు టిడిపి, జనసేన పార్టీలు ప్రజలను మాయ చేస్తూ గత ఎన్నికలలో కూడ టిడీపి లబ్ధి కోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు మాత్రమే పవన్ ఓంటరిగా పోటీ చేసినట్లు ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. ఎన్ని జెండాలు, అజెండాలతో వచ్చినా వైఎస్సార్ సీపీ ఓకే అజెండాతో ప్రజల ముందుకు వెళ్తుందని అన్నారు. అంతిమ విజయం ప్రజల పక్షాల ఉన్న వైఎస్సార్సీపీదే విజయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే లెక్చరర్ల పోస్టులకు భర్తీకి కూడ శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల రెన్యువల్ మూడు సంవత్సరాల నుండి 8 సంవత్సరాలకు పెంచుటకు ఎమ్మెల్సీలు అందరూ కలసి కృషి చేసినట్లు చెప్పారు. పాఠశాలల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
