విద్యార్థులలో దాడి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటమే లక్ష్యంగా జెసీఐ విద్యార్థులకు పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు జెసీ వీక్ చైర్మన్ జాహ్నవి జనార్దన్ తెలిపారు. జెసీఐ వారోత్సవాలలో బాగంగా గురువారం విద్యార్థులకు డ్రాయింగ్ , క్విజ్, ప్యాన్సీ డ్రస్ పోటీలు నిర్వహించారు. పలు రకాల పోటీలలో విజేతలకు గ్రాండ్ డే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తారని జెసీ వీక్ కోఆర్డినేటర్స్ ఆత్మకూరి బ్రహ్మయ్య, సోమినేని సురేష్ లు తెలిపారు. విద్యార్థుల నుండి ఆయా పోటీలలో అనూహ్యమైన స్పందన వచ్చినట్లు చెప్పారు
