కవికోకిల, పద్మ భూషణ్, నవ యుగ చక్రవర్తి గుర్రం జాఘవా 128వ జయంతి సభను జయప్రదం చెయ్యాలని రాష్ట్ర దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. దర్శి ఆర్టీఓ కార్యాలయంలో అందుకు సంబంధించిన కరపత్రాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శి ఎంవీఐ పి. రవికుమార్ ఆవిష్కరించారు. ఈనెల 28న తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జయంతి సభ జరుగునని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శి డీఎస్పీ ఆశోక్ వర్ధన్, తహసీల్దార్ కె. వెంకటేశ్వర్లు, ఎంవీఐ పి. రవికుమార్ లు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో కళాకారులు, కవులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. పద్యాలు ఆలపించే కళాకారులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు 9177079916, 9000033069. 9441125867, 9866239015లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు గట్టుపల్లి ప్రసాద్. గర్నేపూడి ప్రేమకుమార్, అడ్వకేట్ జోషి, గర్నేపూడి ప్రభాకర్, దొంతలూరి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
