పంటలలో రైతులు విశిక్షణారహితంగా రసాయనక మందులు పిచికారి చేసినట్లయితే పంటలు దిగుబడి తగ్గటమే కాకుండా పురుగుమందుల ప్రభావం ఎక్కువగా ఉంటాయని మండల వ్యవసాయ అధికారి ఎండి ఫారుక్ అన్నారు. మండలంలోని ఉలగల్లు గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అధికారుల సలహాలు పాటించాలన్నారు. విత్తనాల మొలక శాతం ప్రాముఖ్యతను వివరించారు. విత్తనాల పోలక చూసి న తర్వాత నే విత్తుకోవాలన్నారు. మొలక శాతం ల్యాబ్ లలో పరిరక్షించే విధాలైన బ్లాటింగ్ పేపర్ పద్ధతి, పెట్ట్రి ప్లేట్ పద్ధతి మరియు మట్టి ట్రైల లో పెంచే పద్ధతిని ప్రదర్శించి చూపించి మానవుల శరీరంపై వివిధ అవయవాలపై పురుగుమందుల యొక్క విష ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనిషిని పడుకోబెట్టి చాటు గీయించి తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ నాయకులు జె ఆంజనేయులు రైతులు పాల్గొన్నారు.
