సాగులో మేలైన పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. శివరామపురంలో శుక్రవారం పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ .. చిరుధాన్యాలలో ఎక్కువగా పండించే సజ్జను మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ మేలైనా యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ధరను పొందవచ్చని చెప్పారు. రైతులకు సూచనలు, సలహాలు అందించారు. విఏఏ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
