భారతీయ జనతా పార్టీలో క్షేత్ర స్థాయిలో కష్టించి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీ అధిష్టానం నుండి గుర్తింపు వస్తుందని బిజేపి ప్రకాశం జిల్లా ఇన్చార్జి పునుగులు రవిశంకర్ అన్నారు. రాష్ట్ర కమిటీ మార్పులు చేర్పులతో బాగంగా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న బిజేపి ప్రకాశం జిల్లా ఇన్చార్జి పునుగుల రవిశంకర్ మాట్లాడుతూ…. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతికి క్షేత్ర స్థాయిలో చేస్తున్న కృషిని పార్టీ అధిష్టానం గమనించి తగిన బాధ్యతలు అప్పగిస్తుందని ఎటువంటి సిఫార్స్ అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరికి పనితీరుపై అధిష్టానం డేగ కన్నుతో గమనిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బిజేపి జిల్లా పార్టీ ఇన్చార్జి పివి క్రిష్ణా రెడ్డి, రాష్ట్ర నాయకులు మరియు పార్లమెంటు కన్వినర్ సెగ్గం శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా డాక్టర్ సెల్ కన్వినర్ డాక్టర్ కొమ్మి నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షులు, అసెంబ్లీ కన్వినర్లు, జిల్లా పదాదికారులు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

