త్వరితగతిన గృహాలు పూర్తి చేసుకోవాలి

గ్రామాలలో నిర్మాణంలో ఉన్న జగనన్న గృహాలను త్వరగా పూర్తి చేసు కోవాలని హౌసింగ్ ఈఈ పి శ్రీనివాస ప్రసాద్ అన్నారు. మండలంలోని పోలవరం ,తమ్మలూరు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న గృహాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాల లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకొనట్లయితే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం గృహ లబ్ధిదారులకు ఇనుము సిమెంటు అందిస్తుందని తెలిపారు. గృహ నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఐ సి హనుమంతరావు, హౌసింగ్ సిబ్బంది గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *