టిడిపి జనసేన పార్టీల పొత్తు ఎప్పటి నుండే ఉన్నదని తిరిగి తిరిగి ఆ పొత్తుకు కొత్త కలరింగ్ ఇవ్వటం వంటి దే అని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతి నుండి వైయస్సార్ కడప వెళుతూ మార్గమధ్యంలో ముండ్ల మూరులో గల శ్రీ సాయి లక్ష్మీ అల్పాహార హోటల్ వద్ద విశ్రాంతి నిమిత్తం ఆగారు. సందర్భంగా ముండ్లమూరు విశాలాంధ్ర విలేఖరి ఎమ్మెల్సీ ని పలకరించగా ఆయన మాట్లాడుతూ బిజెపితో పొత్తులో ఉన్న పవన కళ్యాణ్ నేడు టిడిపితో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ప్రకటించడం ఆయనకు బిజెపితో సరియైన ప్యాకేజీ రాక యూటర్న్ తీసుకొని పూర్తిస్థాయిలో ప్యాకేజీ కోసం ప్రయత్నించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నట్లు చెప్పారు. ఇన్నాళ్లు టిడిపి జనసేన పార్టీలు ప్రజలను మాయ చేస్తూ గత ఎన్నికలలో కూడా టిడిపి లబ్ధి కోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు మాత్రమే పవన్ ఒంటరిగా పోటీ చేసినట్లు ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. ఎన్ని జెండాలు, అజెండాలతో వచ్చినా వైయస్సార్సీపి ఒకే అజెండాతో ప్రజల ముందుకు వెళుతుందని అన్నారు. అంతిమ విజయం ప్రజల పక్షాన ఉన్న వైఎస్ఆర్సిపిదే విజయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే లెక్చరర్ల పోస్టుల భర్తీకి కూడా శ్రీకారం చుట్ట నున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల రెన్యువల్ మూడు సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు పెంచుటకు ఎమ్మెల్సీలు అందరూ కలిసి కృషి చేసినట్లు చెప్పారు. పాఠశాల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్ల
