స్కూల్ గేమ్స్ విభాగంలో దర్శి నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత, ఫిజికల్ డైరెక్టర్ జి భావన్నారాయణ శుక్రవారం అభినందించారు. గురువారం దర్శి లో జరిగిన ఆటల పోటీలలో అండర్ 14 వాలీబాల్ విభాగంలో డి దినేష్ ,బి మధు కిరణ్ లు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అండర్ 17 వాలీబాల్ విభాగంలో బి శివారెడ్డి ఎంపికయ్యారు. వీరందరూ ఈనెల 16వ తేదీ బూధవాడలో జరిగే జిల్లాస్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటున్నట్లు పిడి తెలిపారు. అభినందించిన ఉపాధ్యాయులు నరసింహారావు, షేక్ హజరత్ అలీ, కేఎస్ఆర్ కోటేశ్వరరావు, ఆంజనేయులు, ప్రభాకర్, శివరామ కోటేశ్వరరావు, చక్రపాణి, ఏడుకొండలు, శ్రీనివాసరావు, సుభాషిని, భారతి ,ప్రణతి ,శ్రీదేవి ,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
