మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి 54 ఎకరాలు మంజూరు చేసినట్లు దర్శి క్లస్టర్ ఉపాధి ఏపీ డి పద్మశ్రీ అన్నారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పాఠశాల లు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ వద్ద 75 మొక్కలు నాటి పెంచాలన్నారు. గ్రామాలలో జగనన్న గృహాలు నిర్మించుకున్న వారికి ఉపాధి పథకం ద్వారా 90 రోజులు పని దినాలు కల్పిస్తామన్నారు గ్రామాలలో వివిధ రకాల పండ్ల మొక్కల పెంపకానికి రైతులను సంసిద్ధత చేయాలన్నారు. ఉపాధి సిబ్బంది గ్రామాల్లో మొక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు, ఇన్చార్జి ఎపిఓ మురళి, ఉపాధి ఈజీ ప్రసాదు, శైలేష్ ఆంద్రియ, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
